ఉండవల్లిలో షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన 52మంది విద్యార్థులను గుంటూరులో మంత్రి లోకేశ్ మంగళవారం సన్మానించారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. మీరు ప్రభుత్వ విద్య పరువును కాపాడారు. మీరంతా విజేతలు అని ప్రశంసించారు. పేదరికం వల్ల ఎవరూ చదువుకు దూరం కాకూడదని ప్రోత్సాహం అందించడం తమ బాధ్యత అని అన్నారు.