రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు: పెమ్మసాని

50చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు: పెమ్మసాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 7వేల చొప్పున రాష్ట్రంలోని 65 లక్షల మందికి సోమవారం నుండి పింఛన్లు అందజేయడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్