పెదకాకానిలో శివాలయం వెళ్లే రోడ్డులో ఓ అపార్ట్మెంట్ వెనుక ఉన్న గార్డెన్ లో 'మే' పుష్పాలు పూయడంతో ఇంటి యజమాని, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పూలు చాలా చూడముచ్చటగా ఉన్నాయని, చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. మే నెలలో మాత్రమే ఇవి కనిపిస్తాయని, మేలో పడిన వర్షాలకు మొక్క పైకి వచ్చి పూలు పూస్తాయి అన్నారు.