తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని శ్రీవారి కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పలువురు మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు వారు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కళ్యాణ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజు, శ్రావణ్ కుమార్, తదితరులు ఉన్నారు.