నేడు కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవం

85చూసినవారు
నేడు కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవం
గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఎస్ఆర్, శంకరన్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవం జరగనుందని డీఈవో పి. శైలజ తెలిపారు. గుంటూరు జిల్లాస్థాయిలో ఎంపికైన 14 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆమె చెప్పారు. పురస్కారాలకు ఎంపికైన వారు మధ్యాహ్నం 2 గంటలకే కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్