గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 90వేల బస్తాలు చేరుకున్నాయి. ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజా రకాలు రూ. 10,000-13,200, 334, సూపర్ 10 రకాలు రూ. 8,500-12,000, బంగారం, బులెట్ రకాలు రూ. 9,000-12,000, కర్నూల్ డిడి రకాలు రూ. 10,000-11,500 వరకు ఉన్నాయి. భద్రాచలం రూ. 10,000-13,500, సిజెంటా బాడీగ రకాలు రూ. 8,000-11,500, 2043 రకాలు రూ. 10,000-14,000 వరకు ఉన్నాయి. కాగా హోలీ సందర్భంగా రేపు యార్డుకు సెలవు ప్రకటించారు.