కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం గుంటూరు జీజీహెచ్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పర్యటన ఉంటుందని మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరు జీజీహెచ్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి కేంద్ర మంత్రి తెలుసుకోనున్నారని, సమీక్ష అనంతరం సభ జరుగుతుందని తెలిపారు.