పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా వై. వీర సోమయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా నెల్లూరు నుంచి ఆయన ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు ను వీఆర్ కు పంపారు. 2007 బ్యాచ్ కు చెందిన వీర సోమయ్య నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎస్ఐగా పని చేశారు. 2017లో సీఐగా పదోన్నతి పొందిన ఆయన నెల్లూరు జిల్లాలోని స్టేషన్లతో పాటు వివిధ విభాగాల్లో విధుల్ని నిర్వర్తించారు.