ప్రజలు ఆపదలో ఉన్నారని తెలిస్తే మరుక్షణం స్పందించే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. ఆయన గురువారం గుంటూరులోని కార్యాలయంలో మాట్లాడారు. వరద బాధితుల కోసం రూ. 6 కోట్లు సొంత డబ్బుని దానం చేసిన అపర దాన కర్ణుడు పవన్ అని కొనియాడారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ని విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్క వైసీపీ నేతకు లేదు అని విమర్శించారు.