గుంటూరులోని ఒక ఐరన్ షాపులో చోరీ జరిగిన ఘటనపై నగరంపాలెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆర్. అగ్రహారానికి చెందిన రోహిత్ చుట్టుగుంట వద్ద ఐరన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఉదయం దుకాణానికి వెళ్లి చూస్తే షాపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలిస్తే క్యాష్ బాక్స్ లో రూ. 30 వేలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.