ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కుంకలమర్రు గ్రామస్తులు తమ వంతు భాగస్వామ్యం చెల్లిస్తూ రూ. 1,53,100ల చెక్కును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు సోమవారం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు. కుంకలమర్రు గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.