జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలిగా భవానీదేవి

62చూసినవారు
జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలిగా భవానీదేవి
గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలుగా డాక్టర్ సి. భవానీదేవి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు పట్టణంలో జిల్లా కేంద్ర గ్రంథాలయలో జిల్లా రచయితల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఖాళీగా ఉన్న అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నిక ప్రక్రియలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు డాక్టర్ భవానీదేవిని ఎన్నుకున్నట్లు సంఘ ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం సుభాని తెలిపారు.

సంబంధిత పోస్ట్