గుంటూరులో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బైక్ పై స్టంట్లు చేస్తున్న ఓ యువకుడిపై ఆదివారం కేసు నమోదైంది. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ వారి చర్యల అనంతరం తనకు కనువిప్పు కలిగిందని, తన మాదిరిగా ఎవరూ బైక్ స్టంట్లు చేసి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని, తాను చేసిన స్టంట్లకు పశ్చాత్తాపపడుతున్నట్టు యువకుడు తెలిపాడు.