కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం గుంటూరులోని పొన్నూరు రోడ్డులో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కార్యాలయంలో అభినందన సభ జరిగింది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ షేక్ సజీల, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.