ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌పై మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేదంటూ గుంటూరు మిర్చి యార్డు వద్ద గుంటూరు-సత్తెనపల్లి రోడ్డుపై బుధవారం రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కనీసం రూ. 20,000 ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆందోళనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మిర్చి బస్తాలను రోడ్డుపై పోసి రైతులు నిరసన తెలిపారు.