జూలై 1 ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పెన్షన్ల పంపిణీ పై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీకి చేసిన ఏర్పాట్లను వివరించారు.