లక్షా 30 వేల మంది ఉద్యోగులతో పింఛన్ పంపిణీ

59చూసినవారు
లక్షా 30 వేల మంది ఉద్యోగులతో పింఛన్ పంపిణీ
తాడేపల్లి పరిధి పెనుమాకలో జులై 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నందున, అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి లక్షా 30 వేల మంది ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జేసి రాజకుమారి తదితరులు వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్