దుగ్గిరాలలో అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో బుధవారం తనిఖీలు చేశారు. కొత్తగా నిర్మించనున్న ఎస్సీ బాలికల వసతి గృహానికి తాత్కాలిక భవనం అవసరంగా ఉన్నందున, అందుబాటులో ఉన్న బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జబీన్, తహశీల్దార్ సునీత, ఎస్‌డబ్ల్యూఓ రామారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.