గుంటూరు జిల్లా ఏఆర్ డీఎస్పీగా దుండి ఏడుకొండలు రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటి వరకు విశాఖపట్నం హోంగార్డ్స్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్ డీఎస్పీగా నియమితులై బుధవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.