
GDS ఫలితాలు వచ్చేశాయ్
పోస్టల్ శాఖ తాజాగా గ్రామిణ్ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు సంబంధించి మూడో షార్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. మార్చిలో తొలి జాబితా, ఏప్రిల్ రెండో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో సారి అధికారిక వెబ్సైట్లో మెరిట్ ఆదారంగా షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితాను https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో పొందుపరిచింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 442 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. తెలంగాణలో 77 మంది ఎంపికయ్యారు.