పొలం పనులు చేసుకుంటుండగా పాముకాటుకు గురైన రైతు చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడికొండూరు మండలం విశదలకు చెందిన పర్రా సురేష్ గురువారం మధ్యాహ్నం తన వ్యవసాయ భూమిలో పనులు చేసుకుంటుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.