ఈనెల 16న గుంటూరులో రైతుల ధర్నా

85చూసినవారు
ఈనెల 16న గుంటూరులో రైతుల ధర్నా
రాష్ట్రంలో మిర్చికి క్వింటాలుకు రూ. 20,000 ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఏపీ రైతు సంఘం ఈ నెల 16న గుంటూరు మిర్చి యార్డు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస మద్దతు ధర అమలు కావడం లేదని, మిర్చి క్వింటాలకు రూ. 8-9 వేలకే ధర పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్