గుంటూరు కొత్తపేట ప్రధాన రహదారి సిగ్నల్ వద్ద ఉన్న ఓ హోర్డింగ్‌కు కట్టిన ఫ్లెక్సీ ప్రమాదకరంగా మారింది. గాలికి అది ఊడి విద్యుత్ తీగలకు తగలడంతో వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడేమి జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మునిసిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఫ్లెక్సీని తొలగించాలంటూ ఆదివారం స్థానికులు కోరుతున్నారు.