రాష్ట్రంలో శనివారం ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 58%, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 76 శాతంతో ఉత్తీర్ణత పొందారు. రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. ప్రభుత్వ కళాశాలలో చదివి రాష్ట్రంలో రెండవ స్థానం అధిక ఉత్తీర్ణత పొందడంతో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు అభినందనలు తెలిపారు.