గుంటూరులోని అంబేద్కర్ భవనంలో ఆదివారం కీర్తిశేషులు, దళిత రత్న, మాజీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కొర్రపాటి చెన్నకేశవులు 57వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపామోహన్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా అడపామోహన్ మాదిగ మాట్లాడుతూ, కొర్రపాటి చెన్నకేశవులు దళితుల హక్కుల కోసం నిస్వార్ధంగ పోరాడారని వారి సంక్షేపం కోసం ఎనలేని కృషి చేశాడని కొనియాడారు.