బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆదివారం గుంటూరులోని హిందూ కాలేజీ సెంటర్ లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇతర నేతలతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ. బాబు జగజీవన్ రామ్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజల కోసం జగజీవన్ రామ్ చేసిన త్యాగాలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు.