గుంటూరు జిల్లా అడివితక్కెళ్లపాడులో నిర్మించిన గిరిజన భవనాన్ని త్వరలో ప్రారంభించాలంటూ గిరిజన సంఘాల నాయకులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు. సమావేశాలకూ ఇతర కార్యక్రమాలకూ స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఆగస్టు 9న జరిగే ప్రపంచ గిరిజన దినోత్సవానికి ఈ భవనాన్ని ప్రారంభించాలని వారు కోరారు.