జ్యోతిరావ్ పూలే, సావిత్రి భాయ్ పూలే 180 సంవత్సరాల క్రితమే సామాజిక చైతన్యం, మహిళా విద్య కోసం కృషి చేశారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తుచేశారు. గురువారం గుంటూరులో లక్ష్మణరావు మాట్లాడుతూ 1931వ సంవత్సరంలో కులాల వారీగా జనగణన జరిగిందని, ప్రధానంగా ఇప్పుడు బీసీ గణన జరగాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. బీసీ జనగణన జరిగితే బీసీలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.