పదవ తరగతి 2024–25 పరీక్షల షార్ట్ మెమోలు రాష్ట్ర వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిణి సి. వి. రేణుక తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసి, సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మెమోలలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఈ నెల 25లోపు తగిన ఆధారాలతో డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, విజయవాడలోని గొల్లపూడి కార్యాలయానికి పంపించాలని ఆమె స్పష్టం చేశారు.