కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. హెబ్రీ బర్లీ పొగాకు కొనుగోలు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. రూ.300 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించాలని సీఎం సూచించారు. అనంతరం గోయల్ గుంటూరు బయల్దేరారు.