కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రూ.1,58,604 కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. గుంటూరులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతితో పరాకాష్టకు చేరి, సంక్షేమ పాలనను పూర్తిగా అట్టడుగుకు తీసుకెళ్లిందని, రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందన్నారు.