గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ శుక్రవారం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భద్రత ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. అధికారుల తీరును సమీక్షించి, విధులు చురుగ్గా నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు.