గుంటూరు నగరంలో మిషన్ గ్రీన్ అమలు, వీధి వ్యాపారులకు జోన్ల కేటాయింపుపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జూలై 7న మధ్యాహ్నం 3.30కు, 8న మధ్యాహ్నం 4 గంటలకు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తామని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. స్టేక్ హోల్డర్లు, సీనియర్ సిటీజన్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు పాల్గొంటారు.