అమరావతి రాజధానిపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా రైతులు గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి యాజమాన్యం, జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలు కూడా బాధించాయన్నారు. జగన్, భారతీరెడ్డి మౌనం ఎందుకని ప్రశ్నించారు. తుళ్లూరులో మహిళలు, తాడేపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.