గుంటూరు జీఎంసీ పరిధిలోని పొన్నూరు రోడ్ ఎంఆర్ఎఫ్ ని సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రత్యేక రిజిస్టర్ ద్వారా చెత్త తరలింపు వాహనాల ట్రిప్ ల వివరాలు నమోదు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మెటీరియల్ రికవరీ ఫెసిలిటి సెంటర్ని, కొండయ్య కాలని, రాజీవ్ గాంధి నగర్, శ్యామలానగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు.