గుంటూరులో బొంగరాలాబీడుకు చెందిన కల్పన (19) ఓ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంట్రెన్స్ కోచింగ్ నిమిత్తం అమరావతిరోడ్‌లోని కాలేజీ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఎక్కడికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదని అనుమానంతో అతని తల్లి భారతి అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.