గుంటూరు జిల్లాలోని 1,072 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, 68 వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. విద్యార్థులకు పోషకాహారంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని కలెక్టర్ భార్గవ్ తేజ గురువారం తెలిపారు. 25 కిలోల బస్తాలపై క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాకింగ్ చేసి, అక్రమాలకు తావులేకుండా నేరుగా పాఠశాలలకు పంపిస్తున్నట్టు చెప్పారు.