రౌడీలను ప్రజలపై వదిలేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి గొట్టిపాటి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మహిళలు నిరసన తెలపడంపై దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన వారు ఇప్పుడు మళ్లీ ఎదురు దాడులకు దిగడం తగదు అన్నారు. ఇది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంగా కనిపిస్తోందని మండిపడ్డారు.