గుంటూరు: పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాధవి

53చూసినవారు
గుంటూరు: పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాధవి
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం గుంటూరులోని మార్కెట్ సిగ్నల్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు ఎనలేనివని అన్నారు.

సంబంధిత పోస్ట్