శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులపై అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. బ్రిడ్జి పనుల్లో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలి అన్నారు. నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవు అన్నారు.