డిప్యూటీ సీఎం తలసేమియా చిన్నారులకు అండగా నిలిచారు. వారి కోసం రూ.50 లక్షల విరాళం అందించారు. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన సోమవారం విరాళాన్ని చెక్ రూపంలో అందించారు.