గుంటూరు ఎస్.వి.ఎన్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 23వ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చక్రస్నానం, పూర్ణాహుతి, హోమాలు, విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం, ఊంజల్ సేవ, ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు.