గుజరాత్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై గురువారం సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. భారతీయులతో పాటు విదేశీయులు ఈ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని, యావత్ దేశాన్ని ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, దేశం మొత్తం కేంద్రానికి బాసటగా నిలవాలంటూ పిలుపునిచ్చారు.