అమరావతి రైతులపై ఓ ఛానెల్లో కించపరిచేలా మాట్లాడరని ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాస్ ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను సోమవారం గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఆరోగ్య సమస్యల కారణంగా అతన్ని జీజీహెచ్‌కు తరలించి అనంతరం కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.