గుంటూరు నగరంలోని ఆటోనగర్ సబ్‌స్టేషన్ ద్వారా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈ ఖాన్ ప్రకటించారు. మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని, గడ్డిపాడు, గణేష్ నగర్, గాయత్రీనగర్, ఆటోనగర్ ఫేజ్ 1, 2 తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు సహకరించాలని అధికారులు నిర్ణయించారు.