సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మండల, డివిజన్ మరియు మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు అందరూ ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలో మండల కార్యాలయాలను, డివిజన్ కార్యాలయాలను లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవచ్చని ఈ సందర్భంగా ఆవిడ కోరారు.