ఆచార్యనాగార్జున యూనివర్శిటీ 2015లో ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసును గుంటూరు కోర్టు ఇవాళ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించలేక పోయిందంటూ కేసుని కొట్టివేస్తూ కోర్టు శుక్రవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో 9ఏళ్లుగా న్యాయం చేయాలంటూ తిరుగుతున్న రిషితేశ్వరి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో వారుబోరున విలపించిన తీరు కలిచివేసింది.