గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు ఎస్ఐ సుబ్బారావు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు రౌడీషీటర్లపై నిఘా కొనసాగుతుందని, ఏవైనా వివాదాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని తెలిపారు.