సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసిన పాలిసెట్ -2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 4, 129 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2587 మంది బాలురు, 1542 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 96. 52% గానూ, బాలికల ఉత్తీర్ణత శాతం 97. 99 % గా నమోదయింది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 97. 07% గా ఉంది.