‘తల్లికి వందనం’పై వైకాపా చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ఇచ్చిన గడువు ముగిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. మట్టి చల్లి, ప్యాలెస్ లో దాక్కోవడం జగన్‌కు అలవాటని ఎద్దేవా చేశారు. నిరూపించలేకపోయారు, క్షమాపణ కోరలేదు. అందుకే ఫేక్ జగన్ అని అంటున్నానన్నారు. న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. శరణమా? న్యాయ సమరమా? తేల్చుకోండి అంటూ శనివారం ట్వీట్ చేసారు.